ఈ ఏడాది ఉత్తమ టాలీవుడ్​ చిత్రంగా ‘పుష్ప’..జోస్యం చెప్పిన యూఏఈ సెన్సార్​ బోర్డు సభ్యుడు ఉమైర్

Umair, a member of the UAE Censor Board, predicted that 'Pushpa' would be the best Tollywood film of the year

0
40

సుకుమార్​ దర్శకత్వంలో అల్లుఅర్జున్​ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఈ సినిమానుంచి ఏచిన్న అప్ డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్  అవుతుంది సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా పుష్ప సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఫార్మాలిటీస్ పూర్తిచేసి సెన్సార్ బోర్డ్ పుష్ప చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది.

తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన యూఏఈ సెన్సార్​ బోర్డు సభ్యుడు ఉమైర్​ సంధు ఫస్ట్​ రివ్యూ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ ఏడాది ఉత్తమ టాలీవుడ్​ చిత్రంగా ‘పుష్ప’ నిలుస్తుందని జోస్యం చెప్పారు. బన్నీ నటన అదిరిపోయిందని కితాబిచ్చారు. హీరోయిన్​ రష్మిక కూడా బాగా నటించిందని, హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సూపర్​గా ఉందని అన్నారు. కథ, స్క్రీన్​ ప్లే, డైలాగ్స్​, సుకుమార్​ దర్శకత్వం అద్భుతంగా ఉందని ప్రశంసించారు.