మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మరో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్(Ram Charan)-ఉపాసనల(Upasana Konidela) పెళ్లి జరిగి.. నేటికి 11 ఏళ్లు పూర్తయిది. ఈ సందర్బంగా ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలలో ఓ వీడియో షేర్ చేసుకున్నారు. స్టెమ్ సైట్ ఇండియాను ఎంచుకున్నానని.. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే ఏంటో చెప్పుకొచ్చింది. స్టెమ్ సైట్ ఇండియాలో.. పుట్టబోయే బిడ్డకు సంబంధించిన కోర్డ్ బ్లడ్‌ను దాచుకుంటున్నట్లు తెలిపింది. స్టెమ్ సెల్ బ్యాంకింగ్‌లో పుట్టిన బిడ్డకు సంబంధించిన బొడ్డు తాడును దాచుకోవడం వలన పెద్దయ్యాక వారికేమైనా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు వాటి చికిత్సకు బొడ్డు తాడును ఉపయోగిస్తారని తెలిపింది.