రోహిత్ శర్మ కెప్టెన్‌గా టీమిండియా చివరి సిరీస్ అదే!

-

వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్-2023లో టీమిండియా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా(Australia) చేతిలో చిత్తుగా ఓడిపోయి ఇంటిబాట పట్టింది. కాగా, 2021 టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్.. 2013 నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. జట్టులో ఎంతోమంది సీనియర్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ చతికిలపడుతూనే వస్తోంది. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ పరాజయం పాలవ్వడంతో టీమిండియాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బీసీసీఐ(BCCI) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ(Rohit Sharma)ను తప్పించనున్నట్లు సమాచారం. జూలై 12 నుంచి భారత్ వెస్టిండీస్ పర్యటించనుంది. ఈ సిరీస్‌లో భాగంగా టీమిండియా 2 టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20లను ఆడనుంది. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి తుది జట్టును బీసీసీఐ ప్రకటిస్తుంది. అయితే ఈలోపే రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని వార్తలు రాగా, బీసీసీఐ స్పందించింది. రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఇప్పట్లో టెస్ట్ కెప్టెన్సీ నుంచి తొలగించేది లేదని.. వెస్టిండీస్ టూర్ తర్వాత దీనిపై చర్చిస్తామని అన్నారు.

Read Also:
1. పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్‌డేట్.. హీరోయిన్ ఫస్ట్‌లుక్ విడుదల
2. ఆ బలం కావాలంటే బీట్ రూట్ జ్యూస్ తాగాల్సిందే
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...