‘రామారావు ఆన్ డ్యూటీ’ నుండి అప్డేట్..టైటిల్ సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

0
34

మాస్ మహారాజ్ రవితేజ దూకుడు పెంచారు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే క్రాక్ తో హిట్ కొట్టిన హీరో ఖిలాడీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఇక తాజాగా రవితేజ నటిస్తున్న మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’

శరత్ మండవ దర్శకుడు కాగా దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొంతకాలం క్రితం హీరోగా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఈ సినిమాలో కీ రోల్ పోషించనున్నారు.  ఈ సినిమా జూలై 29న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ సినిమా నుండి అదిరిపోయె అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ సాంగ్ కు ముహూర్తం ఖరారు చేసింది. కింగ్ ఆఫ్ ద క్రౌడ్ అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ ను జులై 22వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్రాలు బృందం ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ కూడా వదిలింది.