బిగ్ బాస్: కెప్టెన్సీ పోటీదారుల ఎంపికలో భాగంగా హౌస్‌లో వాడీవేడీ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతవారం రోజుల నుంచి సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబో హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో హౌస్‌మేట్స్ అందరూ ఫుల్ హ్యాపీ అయ్యారు. హౌస్‌లోకి లోబో రావటాన్ని దూరం నుంచి చూసిన రవి.. ఆనందంతో పరిగెత్తుకుని వచ్చి అతన్ని గట్టిగా హత్తుకున్నాడు.
విశ్వ, అనీమాస్టర్ సైతం లోబో ఎంట్రీ పట్ల సంతోషంగా ఉన్నారు. మరోవైపు, బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో గెలుపొందడం కోసం జెస్సీ.. సిరి సాయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే జెస్సీకి సిరి సాయం చేయడాన్ని షణ్ముఖ్ జీర్ణించుకోలేకపోతున్నాడు. దీంతో, జెస్సీ-సిరిలపై షణ్ముఖ్ ఆగ్రహానికి లోనయ్యాడు. ‘‘ఇంటి సభ్యులందరూ ‘టాస్క్ సరిగ్గా ఆడు’ అంటున్నారు.
అందరూ నన్ను లైట్ తీసుకుంటున్నారు. జెస్సీ కెప్టెన్ అవ్వాలనుకున్నాడు. నువ్వు సాయం చేశావు. చివరికి నేను ఇలా మోసపోయాను. నాకు గేమ్ ఆడటం కూడా రాదు అదే నా దరిద్రం’’ అంటూ షణ్ముఖ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు షణ్ముఖ్ మాటలతో సిరి, జెస్సీ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. మంచి స్నేహితులుగా ఉన్న షణ్ముఖ్-సిరి-జెస్సీల మధ్య అంతలా గొడవ జరగడానికి కారణమేమిటో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే..