స్పీడు పెంచిన మెగా హీరో

స్పీడు పెంచిన మెగా హీరో

0
131

మెగా హీరోలు వరుసగా సినిమాలు చేసి ఏడాదికి సుమారు మెగా ఫ్యామిలీ తరపున ఆరు సినిమాలు అందిస్తున్నారు.. దీంతో మెగా అభిమానులకి ఏడాది నుంచి పండుగ వాతావరణం కనిపిస్తోంది.. తాజాగా పవర్ స్టార్ పింక్ సినిమా షూటింగులో పాల్గొన్నారు.. ఇక కొత్తగా మెగా హీరో ఇటీవల సినిమాస్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఉప్పెన రూపొందుతోంది. ఈ సినిమా ద్వారానే ఆయన తెలుగు తెరకి హీరోగా పరిచయమవుతున్నాడు. మైత్రీ మూవీమేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాపై మెగా అభిమానులు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు …అయితే వైష్ణవ్ తేజ్ చాలా వరకూ పవన్ లా ఉంటాడు అని ఇప్పటికే ఫ్యాన్స్ అంటూ ఉంటారు అంతా మేనమామ పోలికలు అంటూ ఉంటారు.

ఈ సమయంలో ఆయన మానరిజం ఉంటుంది అని చూస్తున్నారు, తాజాగా ఈ సినిమా పూర్తవుతుండగానే వైష్ణవ్ తేజ్ మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది. అవును నందిని రెడ్డి వినిపించిన కథ నచ్చడంతో ఈ చిత్రం చేయడానికి ఒకే చెప్పారట, అయితే ఇటీవల ఓ బేబి చిత్రం సక్సెస్ తో నందినీ రెడ్డి మార్చి నుంచి సినిమా పట్టాలెక్కిస్తారట. అశ్వనీదత్ కుమార్తెలు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తారని చెబుతున్నారు.