మండే – మండలిపై జగన్ కీలక నిర్ణయం బాబుకి షాక్

మండే - మండలిపై జగన్ కీలక నిర్ణయం బాబుకి షాక్

0
40

ఏపీలో శాసన మండలి రద్దు చేయాలి అనే ఆలోచన ఏపీ సర్కారు చేస్తోంది అనేది తెలిసిందే .. ఇప్పటికే ఈ విషయం పై కీలక నిర్ణయం తీసుకుంటారు అని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నారు, తాజాగా శాసన సభలో మాట్టాడారు ఆయన.

విడిపోయిన, ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. మేధావుల కోసం అప్పట్లో పెద్దల సభ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. డాక్టర్లు, పీహెచ్డీలు చేసినవాళ్లు, సివిల్ సర్వెంట్లు అసెంబ్లీలో ఉన్నారని, ఇంతకు మించిన మేధావులు ఇంకెక్కడ దొరుకుతారన్నారు. ఇంత మంది విజ్ఞులు అసెంబ్లీలోనే ఉంటే, మండలి అవసరమేముందని మరోసారి ప్రశ్నించారు.

అంతేకాదు దీనికోసం సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు చేస్తున్నాము అని తెలిపారు ఆయన అయితే ఎలాంటి సంకేతాలు ఇచ్చేందుకు… ప్రతిపక్ష నేత చంద్రబాబు గ్యాలరీలో కూర్చున్నారో అందరికీ తెలుసన్నారు. మండలి అనేది సలహాలు, సూచనలు చేసే పెద్దల సభగా ఉండాలని జగన్ అభిప్రాయపడ్డారు. మండలి బిల్లులు చట్టం కాకుండా నిరోధించే సభగా మారిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా రాజధాని పెట్టొచ్చు అని జగన్ చెప్పారు. మొత్తానికి దీనిపై మండే కీలక నిర్ణయం తీసుకుంటారు అని తెలుస్తోంది, ఈ మూడు రోజులు జగన్ సలహాలు తీసుకుని ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుంటారట.