vantalakka: నాగచైతన్య సినిమాలో వంటలక్క

-

కార్తీక దీపం ఫేం దీప అనేకంటే వంటలక్క (vantalakka) అంటే ఎంతో త్వరగా గుర్తుపడతారు తెలుగు ప్రేక్షకులు. ఈ బుల్లితెర క్వీన్‌ ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అవుతోంది. అది కూడా అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ఓ కీ రోల్‌ పోషిస్తోంది. మానాడు ఫేం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా, కృతిశెట్టి హీరోయిన్‌గా ఓ NC 22 అనే వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో చిత్రంలో నటిస్తున్న నటీనటులను పరిచయం చేస్తున్నారు. లెజెండరీ నటుడు శరత్‌ కుమార్‌, ప్రియమణి, వెన్నెల కిషోర్,‌ సంపత్‌ రాజా వంటి నటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ లిస్టులోకి ఇప్పుడు ప్రేమి విశ్వనాథ్‌ అలియాస్‌ వంటలక్క (vantalakka) కూడా చేరింది. మూవీ మేకర్స్‌ ప్రేమి విశ్వనాథ్‌కు సెట్‌లోకి స్వాగతం పలుకుతూ, చిత్ర నిర్మాణ సంస్థ ఓ ఫోటోను ట్వీట్‌ చేసింది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. ఇందులో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా చైతన్య కనిపించనున్నారట.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...