Yashodha movie: యశోద సినిమా స్టోరీనే హీరో

-

Yashodha movie:సమంత నటించిన యశోద చిత్రం నవంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచారు. యశోద సినిమాలో ముఖ్యపాత్రను పోషించిన వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యశోద సినిమా స్టోరీనే హీరో అని అన్నారు. ఈ సినిమాలో తన పాత్ర కొంత పాజిటివ్‌గా, మరికొంత నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర అని వివరించారు. ఉల్లిగడ్డను ఒలిస్తే పొరలు ఎలా ఉంటాయో.. ఆ విధంగానే తన రోల్‌లోనూ అన్ని వేరియేషన్స్‌ ఉంటాయని వరలక్ష్మీ తెలిపారు.

- Advertisement -

యశోద సినిమా (Yashodha movie)పైసా వసూలు మూవీ అని అన్నారు. ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని, కథపరంగా సైఫై, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఉంటుందని వివరించారు. క్వాలిటీ విజువల్స్‌ ఉంటాయన్నారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ వర్క్‌ కనబడుతుందన్నారు. ఈ సందర్భంగా సరోగసి విధానంపై వరలక్ష్మీ స్పందించారు. సరోగసి అనేది కాంప్లికేట్‌ సబ్జెక్ట్‌ కాదనీ.. సెలబ్రెటీల కారణంగానే కాంప్లికేట్‌ అవుతోందని కామెంట్‌ చేశారు. ఈ సినిమాలో సరోగసి అనేది ఒక టాపిక్‌ మాత్రమేననీ.. సరోగసి మంచా.. చెడా అని తాము చెప్పటం లేదన్నారు. యశోద కంప్లీట్‌ ఫిక్షన్‌ మూవీ అని తేల్చి చెప్పారు.

Read also: ప్రపంచంలోనే ఎత్తైన శివుడు విగ్రహావిష్కరణ

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...