వర్మ క్లైమాక్స్ సినిమా కలెక్షన్లు తెలిసి నిర్మాతలు షాక్

వర్మ క్లైమాక్స్ సినిమా కలెక్షన్లు తెలిసి నిర్మాతలు షాక్

0
92

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఎవరూ సినిమా చేయడం లేదు.. కాని వర్మ మాత్రం ఓ సినిమా రిలీజ్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది, అంతేకాదు సరికొత్తగా ఈ సినిమాని విడుదల చేశారు వర్మ..పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో లాక్ డౌన్ కు ముందు తెరకెక్కించిన క్లైమాక్స్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి … ఆర్జీవీ వరల్డ్ / శ్రేయాస్ మీడియా యాప్ లో విడుదల చేశారు.

దీనికి ఎంతో హైప్ వచ్చింది, సోషల్ మీడియాలో విపరీతంగా టాక్స్ నడిచాయి, ఇక తాజాగా నగ్నత్వంతో కూడిన ఎన్ఎన్ఎన్ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమా ఆన్ లైన్ లో చూశారు అందరూ, దీనికి ప్రత్యేకంగా వర్మ . 100 టికెట్ ధరను నిర్ణయించారు.

జీఎస్టీ తదితర వాటితో కలిపి రూ. 130 వరకు ఉంది. ఈ చిత్రాన్ని తొలి 12 గంటల్లో ఏకంగా 1,68,596 మంది చూశారు. అంటే తొలి 12 గంటల్లో దాదాపు రూ. 1.6 కోట్లను వసూలు చేసిందన్నమాట. ఇక నెక్ట్స్ ఇలా కొన్ని మూవీస్ ప్లాన్ చేస్తున్నారట వర్మ.