వ‌ర్మ తెలుగు ప్ర‌జ‌ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్

వ‌ర్మ తెలుగు ప్ర‌జ‌ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్

0
63

విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం ఏం చేసినా దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారుతుంది. కొద్ది కాలంగా సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని క‌రెంట్ ఇష్యూష్ పై న స్పందిస్తున్న విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు తాజాగా మ‌రోసారి తాను తీయబోతున్న చిత్రం ల‌క్ష్మీ ఎన్టీఆర్ పై ట్వీట్ చేశారు. ఈ సినిమా సంబంధించి రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల 19 ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఈ చిత్రానికి సంబంధించి చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌కు గాను ఆ పోలిక‌లు ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసి అత‌ని గురించి వివ‌రాలు తెలిసిన వారికి ల‌క్ష‌రూపాయ‌ల బ‌హుమ‌తి ప్ర‌క‌టించ‌డం అలా రోహీత్ అనే వ్య‌క్తికి ల‌క్ష‌రూపాయ‌లు అందించ‌డం జ‌రిగిపోయింది.

ఇదే క్ర‌మంలో ఎన్టీఆర్ పోలిక‌లు ఉన్న వ్య‌క్తి ఎవ‌రికైన క‌నిపిస్తే 10 ల‌క్ష‌ల బ‌హుమ‌తి ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. ల‌క్ష్మీ పార్వ‌తిని క‌లుసుకున్న‌ప్పుడు ఆయ‌న ఎలా ఉన్నారో అలాంటి వ్య‌క్తి కావాల‌ని, అలాంటి వ్య‌క్తిని చూపించిని వారి 10 ల‌క్ష‌లు ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. అందుకు సంబంధించిన వీడియోను laksmisntr@gmail.com కి పంపాల‌ని కోరారు.