Citadel 2 | సినిమాగా ‘సీటాడెల్-2’.. త్వరలోనే చెప్తానన్న వరుణ్ ధావన్

-

‘సీటాడెల్: హనీబన్నీ’ ఇటీవల విడదులై అందరి చేత సూపర్ అనిపించుకుంది. దీంతో ప్రస్తుతం అందరూ కూడా Citadel 2 ఎప్పుడొస్తుందని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై ‘సీటాడెల్: హనీ బన్నీ’ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే ‘సీటడెల్-2’ అప్‌డేట్ ఇస్తానన్నాడు. తాజాగా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా చేసిన చిట్‌చాట్‌లో ధావన్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. ‘‘ప్రస్తుతం నేను వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను. అవి రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. దాంతో పాటుగా రాజ్ అండ్ డీకే ఇద్దరూ కూడా Citadel 2 ను సినిమాగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఇది చర్చల దశలోనే ఉంది. అతి త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం’’ అని వెల్లడించారు. దీంతో ఈ సిరీస్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం దక్కుతుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అయితే ‘సీటాడెల్: హనీ బన్నీ’ సిరీస్‌లో వరుణ్ తన నటనతో అందరి మన్ననలు పొందాడు. బన్నీ పాత్రలో ఒక ఏజెంట్‌లో వరుణ్ అదరగొట్టాడని అభిమానులు అంటున్నారు. ‘సీటాడెల్’ తర్వాత వరుణ్ ఎలాంటి సినిమాలు విడుదల చేయనున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అభిమానులు అంటున్నారు. వరుణ్‌ ధావన్‌ను ఏజెంట్‌గా చూడటం చాలా బాగుందని అంటున్నారు. ఈ సిరీస్‌ను బిగ్‌స్క్రీన్‌పై చూస్తే ఆ థ్రిల్ వేరే లెవెల్లో ఉంటుందని, ఆ రోజు కోసం ఇప్పటి నుంచి వేచి చూస్తున్నామని అభిమానులు చెప్తున్నారు.

Read Also: సమంతను చూస్తే భయమేసింది: వరుణ్ ధావన్
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...