మెగా హీరో వరుణ్ తేజ్-హరీశ్ శంకర్ కాంబోలో గద్దలకొండ గణేష్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే కాంబో మళ్లీ రిపీట్ కానుందా? అంటే అవుననే అనిపిస్తుంది. బుధవారం వరుణ్ పుట్టినరోజు సందర్భంగా హరీశ్ చేసిన ట్వీట్ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది.
గద్దలకొండ గణేష్ చిత్రాన్ని ఉద్దేశిస్తూ హరీశ్ మాట్లాడుతూ..”ఆ పాత్రలో నిన్ను ఊహించుకున్నప్పుడు నాకు తెలియదు.. నువ్వు ఆ పాత్రను ఎంతో కష్టపడి ఆ స్థాయిలో రక్తికట్టిస్తావని. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం నాకు ఎప్పుడూ ఆనందం కలిగించే విషయం. నీతో మరోసారి పనిచేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అని అన్నారు. దీంతో వరుణ్-హరీశ్ కాంబోలో మరో సినిమా వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
కాగాహరీష్ శంకర్ , పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆ సినిమాకు ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ ఏడాది దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక వరుణ్ త్వరలోనే ‘గని’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.