పెళ్లి పీటలెక్కబోతున్న మెగా హీరో.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!

-

Varun Tej Lavanya |టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా తమ బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలుకుతున్నారు. రీసెంట్‌గా శర్వానంద్ తన బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలకగా.. తాజాగా.. ఈ జాబితాలో మెగా హీరో వరుణ్ తేజ్ చేరబోతున్నారు. జూన్‌ 9వ తేదీన హీరోయిన్‌ లావణ్యతో వరుణ్‌ ఎంగేజ్మెంట్‌ జరగనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు విస్తృతం అయ్యాయి. ఈ మేరకు ఓ మీడియా చానల్‌లో వార్తా కథనం ప్రచురితమైంది. ఈ విషయాన్ని మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు పేర్కొంది. హైదరాబాద్‌లోని నివాసంలో లేదా ఓ ఫంక్షన్‌ హాలులో వీరి నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలోనే వీరి వివాహం కూడా ఉంటుందని పేర్కొంది.

- Advertisement -

Varun Tej Lavanya |ఈ వేడుకకు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌, ఉపాసన, సాయిధరమ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌, సుష్మిత, శ్రీజ సహా కొణిదెల కుటుంబం అంతా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్‌ కుటుంబం కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ హాలిడే ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటలీలోని రోమ్‌లో ఉన్నట్లు కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. లావణ్య కూడా ట్రావెలింగ్‌ చేస్తున్నట్లు పోస్టు చేసింది. దీంతో ప్రస్తుతం ఈ జంట హాలిడే డ్రిప్‌లో ఉన్నారని నెటిజన్లు భావిస్తున్నారు. ట్రిప్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాత తమ ఎంగేజ్మెంట్‌ గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read Also:
1. మా నాన్నే నాకు దేవుడు: బన్నీ భావోద్వేగం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్‌పై ప్రభుత్వం క్లారిటీ

తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల(Family Digital Cards) దరఖాస్తు కోసం ప్రభుత్వం...

‘ఆ విజయం మనకు స్ఫూర్తి’.. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలన్న అమిత్ షా

మావోయిస్టు తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit shah) కీలక...