వేణుమాధవ్ సినీ ప్రస్థానం స్టార్టింగ్ టూ ఎండింగ్ ఇలా సాగింది

వేణుమాధవ్ సినీ ప్రస్థానం స్టార్టింగ్ టూ ఎండింగ్ ఇలా సాగింది

0
32

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ యశోద ఆసుపత్రిలో మృతి చెందారు. ఈరోజు ఉదయం నుంచి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్సకోసం ఆయన్ను హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. ఆయనకు వెంటిలేటర్ ద్వారా స్వాస అందించారు కానీ దురదృష్టవ షాత్తు ఆయన ఈ రోజు మరణించారు.

వేణు మాధవ్ కు ఈనెల 6వ తేదిన కాలేయం సంబంధిత వ్యాధి చికిత్స తీసుకున్నారు. తాజాగా ఆ సమస్య తీవ్రం కావడంతో రెండురోజుల క్రితం రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా తయారు కావడంతో ఆయన ఈరోజులు యశోద ఆసుపత్రిలో మరణించారు.

ఆయన మరణ వార్త విన్న చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో వేనుమాధవ్ టీడీపీ తరపున ప్రచారం చేసేవారు. వేణుమాధవ్ స్వస్థలం సూర్యాపేట జిల్లా కోదాడ 1979 డిసెంబర్ 30 సాధారణ కుటుంబంలో జన్మించారు మిమిక్రీ ఆర్టిస్ట్ గా హాస్యనటుడుగా కతానాయకుడిగా తెలుగుచలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసుకున్నారు.

మాధవ్ ఇండస్ట్రీకి రాకముందు అసెంబ్లీలో పని చేసేటప్పుడు ఖాళీ సమయాల్లో ఎదురుగా ఉన్న రవీంద్ర భారతికి వెళ్ళడం లావాటు చేసుకున్నారు వేణుమాధవ్. ఒక సారి ఆకృతి సంస్థ వాళ్ళు మాటల రచయిత దివాకర్ బాబుకు సన్మానం చేస్తుంటే చూడ్డానికి వెళ్ళాడు. అందులో వేదికపైన ఒక చిన్న ప్రదర్శన ఇచ్చాడు. దాన్ని చూసి అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిలు చూసి సినిమాలలో అవకాశం ఇచ్చారు. ఆయన మొదటి సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సాంప్రదాయం అనే సినిమా తొలిప్రేమ సినిమాలో అమ్మాయిలపైన చాటభారతమంత డైలాగును ఆయన్ను ప్రేక్షకులకు చేరువ చేసింది. దిల్ సినిమాతో మంచి పేరు వచ్చింది. లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నాడు. ఇంకా అతనికి పేరు తెచ్చిన సినిమాలు తొలిప్రేమ, సై, ఛత్రపతి, మొదలైనవి. ఎన్టీఆర్ తర్వాత రామోజీరావంటే ఆయనకు గౌరవం, అభిమానం. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి ల చలవతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఈ స్థాయికి చేరుకున్నాడని ఆయన గట్టి నమ్మకం. అందుకనే ఆయన కట్టుకున్న ఇళ్ళకు అచ్చొచ్చిన కృష్ణ నిలయం అని పేరు పెట్టుకుని అభిమానం చాటుకున్నాడు.

వేణుమాధవ్ నటించిన చిత్రాలు

సంప్రదాయం
తొలిప్రేమ
ముత్యం
లాహిరి లాహిరి లాహిరిలో
ఆయుధం
శ్రీరామచంద్రులు
దిల్
143
సై
ఛత్రపతి
అదిరిందయ్యా చంద్రం
హంగామా (హీరో)
లక్ష్మి
భూకైలాస్ (హీరో)
ప్రేమాభిషేకం (హీరో)
అయ్యారే
అడ్డా
టామి