Saindhav Trailer | సైకోగా వెంకీ మామ.. భయపెడుతున్న “సైంధవ్” ట్రైలర్

-

Saindhav Trailer | విక్టరీ వెంకటేశ్ 75వ చిత్రంగా ‘సైంధవ్’ తెరకెక్కింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ నిడివి 3 నిమిషాల 36 సెకన్లుగా ఉంది. ఇంగ్లీష్ పాటతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది.

- Advertisement -

“వెంకటేష్(Victory Venkatesh) కూతురు మా నాన్న సూపర్ హీరో అంటూ చెప్పుకువస్తుంది. మరోవైపు వెంకటేష్ కిరాతకంగా రౌడీలను చంపుతూ ఉంటాడు. మా నాన్న ఉంటే నాకేం భయం కాదు.. అంటూ పాప చెబుతూ ఉంటుంది. హ్యాపీగా సాగుతున్న వారి జీవితంలో అనుకోని సమస్య వస్తుంది. పాప జబ్బు బారిన పడుతుంది. అది నయం కావాలంటే రూ.17 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇవ్వాలి. కట్ చేస్తే… సైకో ఈజ్ బ్యాక్ అంటూ విలన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా యాక్షన్స్ సీక్వెన్స్ ఆకట్టుకుంటున్నాయి. నా తల తీసుకువస్తే డబ్బులు ఇస్తామని చెప్పారా.. నా తల తీసుకురావాలంటే.. మీ తలలు ఉండాలి కదరా అంటూ వెంకీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఇక వెంకటేష్ తన పాపను ఎలా కాపాడుకున్నాడు.. విలన్స్‌ను ఎలా అంతం చేశాడు.. ఎందుకు సైకోగా మారి హత్యలు చేస్తున్నాడు” వంటి అంశాలను ఇందులో చూపించారు. మొత్తానికి ట్రైలర్‌(Saindhav Trailer)తో సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు.

ఇక ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్‌గా, బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ(Nawazuddin Siddiqui) సైకో విలన్‌ పాత్ర చేశారు. తమిళ హీరో ఆర్య(Arya), ఆండ్రియా, రుహానీ శర్మ తదితరులు కూడా మూవీలో నటించారు.

Read Also: బాపట్ల TDP టికెట్ రేసులో సీనియర్ నేత.. వేగేశనకి షాక్ తప్పదా?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...