అర్థ రాత్రి కౌగిలించుకున్న విజయ్ దేవరకొండ – సమంత షాక్ – వీడియో వైరల్….

0
107

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్​ దేవరకొండకు జంటగా సమంత నటిస్తున్నతాజా చిత్రం ‘వీడీ 11’ మూవీ షూటింగ్‌ కశ్మీర్‌లో జరుగుతున్న నేపథ్యంలో గురువారం సమంత​ పుట్టినరోజు సందర్భంగా అర్జున్ రెడ్డి శ్యామ్ ను ఎవరు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చి షాక్ కు గురి చేసాడు. దీంట్లో చిత్రబృందం సహకారం కూడా ఉంది.

అసలేం జరిగిందంటే..అర్ధరాత్రి పూట సీరియస్ గా ఓ సీన్ చిత్రీకరిస్తున్నట్టు టీమ్ అంతా రెడీ అయ్యారు. సమంత కూడా నిజంగానే షూటింగ్ జరుగుతోంది అనుకుంది పాపం. సన్నివేశంలో లీనమై యాక్షన్ చేస్తూ కంటతడి పెట్టుకుంటుండగా..ఒక్కసారే విజయ్ సమంత అని అనడంతో  డైలాగ్ మర్చిపోయాడు అనుకుని నవ్వుకుంది.

అనంతరం టీం మెంబర్స్ అందరు కలసి ఒక్కసారిగా శ్యామ్ కు బర్త్ డే విషెస్ తెలియజేయడంతో అసలు విషయం తెలుసుకుంది. తనకోసం అర్థరాత్రి ఫేక్ షూట్ ప్లాన్ చేశారని తెలియడంతో ఎమోషనల్ అయ్యి ఆనందబాష్పాలుతో కంటతడి పెట్టుకుంది. ఆ తర్వాత టీమ్ మెంబర్స్ అందరు కలసి సమంత తో కేక్ కట్ చేయించి మరింత ఆనందపరిచారు. దాంతో సమంత ఆనందానికి హవదులు లేకుండా పోయాయి.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://fb.watch/cHyBI_6j8O/