ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌లో సందడి చేయనున్న విజయ్ దేవరకొండ!

-

ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా తొలి మ్యాచ్‌ పాకిస్తాన్‌ జట్టుతో ఆడనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ముఖ్యంగా తుది జట్టులో తెలుగు కుర్రాడు, హైదరాబాద్ డైనమైట్ అయిన తిలక్ వర్మ(Tilak Varma) చోటు సంపాదించుకోవడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. విజయ్‌ ప్రస్తుతం ‘ఖుషి’ సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా ఉంటున్నాడు. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఖుషి శుక్రవారం (సెప్టెంబర్‌ 1)న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. కాగా విజయ్‌కు సినిమాలతో పాటు క్రికెట్‌పై కూడా చాలా ఇంట్రెస్ట్‌ ఉంది.

- Advertisement -

గతంలో పలుసార్లు టీమిండియా క్రికెటర్లపై తన అభిమానాన్ని చాటుకున్నాడు కూడా. కాగా, బుధవారం (ఆగస్టు 30) నుంచి ఆసియా కప్‌ ప్రారంభంకానుంది. మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్‌తో నేపాల్‌ తలపడనుంది. శనివారం (సెప్టెంబర్‌ 2) భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్‌లో సందడి చేయనున్నాడు విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda). శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ ఛానెల్లో విజయ్‌ సందడి చేయనున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్‌ చేసింది స్టార్‌ స్పోర్ట్స్‌ ఇందులో టీమిండియా క్రికెటర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విజయ్‌.

ముఖ్యంగా తెలుగబ్బాయి తిలక్‌వర్మను టీమిండియాలో చూడడం ఆనందంగా ఉందన్నాడు. ‘విరాట్ కోహ్లీ ఆట చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఇక రోహిత్‌ శర్మ ఆట కూడా సూపర్బ్‌. ఇక తనదైన రోజున సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎవరూ ఆపలేరు. హార్దిక్‌ పాండ్యా ఆడిన షాట్స్‌ నుంచి వచ్చిన సౌండ్స్‌ అద్భుతంగా ఉంటాయి. ఇక బుమ్రా, సిరాజ్‌, అర్ష్‌దీప్‌ లాంటి బౌలర్లు అద్భుతంగా ఆడుతున్నారు’ అంటూ టీమిండియా స్టార్స్‌పై ప్రశంసలు కురిపించాడు.

Read Also: పండుగపూట తీవ్ర విషాదం.. అన్న శవానికి రాఖీ కట్టిన చెల్లెలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...