తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సైరా, ఉప్పెన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెళ్లో స్థానం సంపాదించుకున్నారు. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో విలన్‌గానూ నటిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తోన్న జవాన్ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. విజయ్ సేతుపతికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఇన్ స్టా(Instagram)లో సేతుపతికి 7.3 మిలియన్ అంటే 73 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కానీ.. విజయ్ మాత్రం కేవలం ఏడుగురిని మాత్రమే ఫాలో అవుతున్నారు. దీంతో క్యూరియాసిటీతో ఆ ఏడుగురు ఎవరు అని ఆరా తీయగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్, తమిళ్ డైరెక్టర్ మిస్కిన్, హీరోయిన్ అంజలి, కోలీవుడ్ నటుడు రమేష్ తిలక్, కోలీవుడ్ గేయ రచయిత కార్తీక్ నేత, డైరెక్టర్ రంజిత్ జయకోడి, తర్వాత తన సొంత నిర్మాణ సంస్థ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ప్రొడక్షన్స్ ఖాతాలను మాత్రమే ఫాలో అవుతున్నారు.
Read Also:
1. ఆకట్టుకుంటోన్న కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ టీజర్
2. టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై హీరో నిఖిల్ షాకింగ్ కామెంట్స్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat