మహేష్ ఫాన్స్ కి కోపం తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ వ్యాఖలు..!!

మహేష్ ఫాన్స్ కి కోపం తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ వ్యాఖలు..!!

0
52
Vijay Deverakonda

నిన్న మహేష్ మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి వెంకటేష్, విజయదేవరకొండ ముఖ్య అతిధులుగా రాగ మే 9 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.. వంశీ పైడిపల్లి దర్శకుడు.. పూజ హెగ్డే హీరోయిన్ కాగా, దిల్ రాజు అశ్విని దత్, పీవీపీ లు సినిమా ని నిర్మించారు.. కాగా ఈ ఫంక్షన్ లో విజయ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహేష్ అభిమానులకు నచ్చడం లేదు.

విజయ్ స్పీచ్ మొత్తంలో ఒక్కసారి మహేష్ బాబు ని గారు అని కానీ సర్ అని కూడా పిలవలేదు.. ఇక స్టార్ హీరో, పెద్ద మనిషి, కోట్ల మంది అభిమానులున్న హీరో ని పదిమందిలో అలా డైరెక్ట్ గా పేరు పెట్టి పిలవడం అయన బహిమానులకు రుచించట్లేదు.. అలాగే విజయ్‌ ఆటిట్యూడ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ‘మహేష్‌ సర్‌’ అనాలంటే అభిమానిగా కొంత ఇబ్బందిగా వుందని విజయ్‌ చెప్పడమే ఆ చర్చకు కారణం.

తనకంటే వయసులో చిన్నవారినైనా ‘సర్‌’ అని పిలుస్తుంటాడు మహేష్‌. అది ఆయన ఇతరులకు ఇచ్చే గౌరవం మాత్రమే కాదు, తన హుందాతనాన్ని చాటుకోవడం కూడా. ‘నేను మహేష్‌ అభిమానిని..’ అని చెప్పేసి, ‘సర్‌’ అనడం కష్టంగా వుందనడం, ‘సర్‌’ అనేందుకు ప్రయత్నిస్తానంటూ సమర్థించుకోవడం.. ఎందుకో ఈ తతంగాన్ని చూసిన మహేష్‌ అభిమానులకీ ఏమంత నచ్చలేదు. విజయ్‌ ఆటిట్యూడ్‌ విషయమై మొదటినుంచీ చాలా విమర్శలున్నాయి.. ఆ ఆటిట్యూడ్‌ ఇప్పుడు ఇంకోసారి వివాదాస్పదమవుతున్నట్లే భావించాలేమో.!