ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ధర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) సుధీర్ఘంగా విరామం తీసుకుంటున్నాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu)తో ప్రకటించిన సినిమా తప్ప.. ఇప్పటివరకు దీని నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో వీరి కాంబినేషన్‌లో రాబోయే సినిమాపై జనాల్లో ఆసక్తి నెలకొంది. అంతేకాదు.. అసలు సినిమా ఉందా? లేదా? అనే అనుమానాలు మరి కొందరిలో రేకెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రం గురించి ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో టాలీవుడ్, బాలీవుడ్ అగ్రతారలతోపాటు హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తారని మొదటి నుంచి వార్తలొస్తున్నాయి.
ఇదే విషయంపై విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad)ను తాజా ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. అవును.. ఆ సినిమాలో హాలీవుడ్ నటీనటులు నటించే అవకాశం ఉంది. కథకు తగ్గట్టు అక్కడి యాక్టర్స్‌ను కూడా తీసుకుంటున్నాం. కానీ ఇంకా ఎవరినీ సంప్రదించలేదు. ఇది ఆఫ్రికాలో సాగే యాక్షన్ అడ్వెంచర్స్ సినిమా. ఇంతకు మించి ఎక్కువ అప్‌డేట్స్ ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు. సినిమా ప్రారంభం అయ్యాక ఒక్కొక్క విషయం మీకే తెలుస్తుంది’’ అని అన్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రంపై ఇప్పటికే విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.