Kannappa | ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అనౌన్స్ చేసిన విష్ణు

-

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరెక్కుతున్న సినిమా ‘కన్నప్ప(Kannappa)’. భారీ క్యాస్ట్‌, బడ్జెట్‌తో మంచు విష్ణు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటి వచ్చిన టీజర్ సహా ఇతర అప్‌డేట్‌లన్నీ కూడా మంచి స్పందననే అందుకున్నాయి. కాగా తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను విష్ణు(Vishnu Manchu) ప్రకటించాడు. ఈ సినిమాను తన టీమ్ శరవేగంగా పూర్తి చేస్తోందని చెప్పాడు.

- Advertisement -

వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా తమ సినిమా రానుందని విష్ణు వెల్లడించాడు. పక్కాగా చెప్పాలంటే 25 ఏప్రిల్ 2025న ‘కన్నప్ప’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చెప్పారు. ‘పరమేశ్వరుడి గొప్ప భక్తుడి కథ తెలుసుకోవడానికి సిద్ధంకండి’’ అని విష్ణు తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టాడు.

మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని ‘కన్నప్ప(Kannappa)’ సినిమాను రూపొందిస్తున్నాడు విష్ణు. ఈ సినిమాకు ‘మహాభారత’ సిరీస్‌ను డైరెక్ట్ చేసిన ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas).. ఈ సినిమా అతిథి పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాకుండా మోహన్‌బాబు, శరత్‌కుమార్, మధుబాల, ప్రీతి ముకుందన్ తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో విష్ణు కుమారుడు అవ్రామ్ కూడా తన సినీ అరంగేట్రం చేయనున్నాడు. బాల తిన్నడుగా అవ్రామ్ కనిపించనున్నాడు.

Read Also: ‘అదానీ విరాళం తీసుకోం’.. ప్రకటించిన సీఎం
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...