వివాహం చేసుకున్న బిగ్ బాస్ 2 ఫేమ్ సామ్రాట్ – అమ్మాయి ఎవరంటే

వివాహం చేసుకున్న బిగ్ బాస్ 2 ఫేమ్ సామ్రాట్ - అమ్మాయి ఎవరంటే

0
105

ఈ కరోనా సమయంలో ఏడు నెలల కాలంలో చాలా మంది సినిమా సెలబ్రెటీలు వివాహాలు చేసుకుని ఒకటయ్యారు, అంతేకాదు కొందరు నిశ్చితార్దం కూడా చేసుకున్నారు, తాజాగా మరో నటుడు వివాహం చేసుకున్నాడు, అతను ఎవరో కాదు బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ సామ్రాట్..

బిగ్ బాస్ రెండవ సీజన్లో అందరి దృష్టిని ఆకర్షించిన సామ్రాట్, శ్రీ లిఖిత అనే అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించాడు. వీరి వివాహం కర్ణాటకలో జరిగింది, అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య వివాహం జరిగింది.

తనీష్, దీప్తి సునైన ఈ పెళ్లికి హాజరయ్యారు. గతంలో హర్షిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సామ్రాట్, ఆ తర్వాత కొంత కాలానికి ఆమెతో విడాకులు తీసుకున్నారు, ఇప్పుడు ఈమెని వివాహం చేసుకున్నారు, ఈ జంటకి అందరూ బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నారు. సామ్రాట్ ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్నారు.