War 2 | ‘వార్ 2’లో కూడా డ్యాన్స్ మ్యానియా పక్కానా!

-

War 2 | కొన్నేళ్లుగా మల్టీస్టారర్ సినిమాలకు గిరాకీ పెరుగుతోంది. అందులోనూ నటించే హీరోలు ఇద్దరూ యాక్షన్, డ్యాన్స్, యాక్టింగ్‌లలో దిట్ట అయితే ఆ సినిమా ప్రేక్షకులకు జాతరే. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ నిరూపించింది. అందులో ఎన్‌టీఆర్, చెర్రీ కలిసి వేసిన ‘నాటు నాటు’ పాట, స్టెప్‌ అయితే యావత్ ప్రపంచాన్నే షేక్ చేశాయి. అలాంటిది ఇప్పుడు మరోసారి ఇలాంటి కాంబోనే రిపీట్ కానుంది. అదే ‘వార్-2’. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్ స్టార్ హీరో ఎన్‌టీఆర్(Jr NTR) కలిసి నటిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘వార్-2’ కూడా నాటునాటు రేంజ్ పాట ఒకటి ఉండనుందనేది హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌తో పాటు ఇండియా సినీ ఇండస్ట్రీలో ఈ న్యూస్ కీలకంగా మారింది.

- Advertisement -

War 2 | హృతిక్‌ రోషన్‌, తారక్‌లపై ఎపిక్‌ డ్యాన్స్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ చేస్తున్నారు. ఇది ముంబై యశ్‌రాజ్‌ స్టూడియోస్‌లో జరుగుతోంది. 500 మందికి పైగా డ్యాన్సర్లతో ఆరు రోజులపాటు భారీ స్థాయిలో ఈ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. బాస్కో మార్టీస్‌ కొరియోగ్రాఫీ అందిస్తుండగా ప్రీతమ్‌ ఈ పాటకు సంగీతాన్ని అందించారు. ఈ పాటతో సినిమా షూటింగ్‌ పూర్తవుతుంది. ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో నాటు నాటు తరహాలో ఈ పాటు ఫ్యాన్స్‌ అలరించబోతోందని యూనిట్‌ చెబుతోంది. మరి హృతిక్, ఎన్‌టీఆర్ కాంబో స్టెప్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు.

Read Also: నన్ను అలా పిలవద్దు.. అభిమానులకు నయనతార రిక్వెస్ట్
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Champions Trophy | సౌత్ఆఫ్రికాపై కివీస్ ఘన విజయం

ఛాంపియన్ ట్రోఫీ-2025(Champions Trophy) రెండో సెమీఫైనల్స్‌లో న్యూజిల్యాండ్ ఘటన విజయం సాధించింది....

Rahul Gandhi | రాహుల్‌కి రూ.200 ఫైన్.. ఆ వ్యాఖ్యలే కారణం..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఉత్తర్‌ప్రదేశ్ న్యాయస్థానం రూ.200ఫైన్ విధించింది....