‘బ్రహ్మాస్త్ర’ రెండో రోజు కలెక్షన్లు ఎంతంటే?

0
41

స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర. బాలీవుడ్, టాలీవుడ్ పాపులర్ నటులు రణబీర్ అలియా భట్, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున ప్రధాన తారాగణంతో దర్శకుడు ఆయున్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా..మొదటి భాగం బ్రహ్మాస్త్ర శివ’ పేరుతో విడుదల చేశారు. ఈనెల 9న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.

ఈ మూవీ రెండో రోజు దాదాపు రూ.85 కోట్ల మేర వసూళ్లు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్​ రూ.160 కోట్లకు చేరిందని తెలిపింది. అమెరికాలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. తొలి రోజు యూఎస్ ఏ బాక్సిఫీస్ వద్ద ఈ చిత్రం ఒక మిలియన్ డాలర్లు (రూ. ఏడు కోట్లపైనే) సంపాదించినట్టు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని రూ. 400 కోట్ల బడ్జెట్తో నిర్మించారు.