ఈ పిల్ల ఇలా ఉందేంటి? సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు..

What is this kid like? Saipallavai Interesting Comments ..

0
141

చిత్రసీమలోకి వచ్చిన కొత్తలో అందం విషయంలో తనకు కొన్ని భయాలు ఉండేవని హీరోయిన్ సాయి పల్లవి చెప్పింది. తెరపై సహజంగా కనిపించడానికి ఇష్టపడే ఈ భామ..అంతే సహజమైన అభినయంతో దక్షిణాదిలో స్టార్‌ నాయికగా వెలుగొందుతుంది. అయితే తొలి సినిమా సమయంలో అందం విషయంలో తన ఆలోచనలు ఎలా ఉండేవని ప్రశ్నిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

కాలేజీ చదివే రోజుల్లోనే ఇండస్ట్రీకి వచ్చా. అప్పుడు మిగతా సగటు అమ్మాయిల్లాగే అందం విషయంలో నాకు కొన్ని భయాలుండేవి. ఎందుకంటే అప్పటి వరకు నేను చూసిన హీరోయిన్లంతా ఎలాంటి మచ్చలు లేని అందమైన మోమున్న వాళ్లే. నేను వాళ్లలో సెట్‌ అవుతానా. తెరపై నన్ను చూసి ‘ఈ పిల్ల ఇలా ఉందేంటి?’ అని ప్రేక్షకులంటారేమోనని అనుకునేదాన్ని.

ఎవరైనా నన్ను చూస్తే నా ముఖంపై ఉన్న మొటిమలు చూసి మాట్లాడతారేమోనని మదన పడేదాన్ని. కానీ, ‘ప్రేమమ్‌’ విడుదలయ్యాక నా ఆలోచనలన్నీ తప్పని అర్థమైంది. ఎవరైనా క్యారెక్టర్‌నే ఇష్టపడతారు తప్ప.. పైకి కనిపించే అందాన్ని కాదని తెలుసుకున్నా. అది నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని సాయిపల్లవి చెప్పుకొచ్చింది.

ఇటీవలే ‘లవ్‌స్టోరి’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన సాయిపల్లవి త్వరలో ‘విరాటపర్వం’, ‘శ్యామ్​సింగరాయ్’ సినిమాలతో బాక్సాఫీస్‌ ముందుకు రానుంది.