బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రారంభం అయ్యేది అప్పుడేనట?

When did Bigg Boss Telugu Season 5 start

0
110

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. వాస్తవంగా ఈ జూన్ నెల నుంచి బిగ్ బాస్ ప్రారంభం అవుతుందని అందరూ అనుకున్నారు. కాని కరోనా సెకండ్ వేవ్ దీనికి బ్రేకులు వేసింది. ఇక ఛానల్ లో మరో కొత్త ప్రోగ్రాం స్టార్ట్ అవ్వడంతో అసలు సీజన్ ఉంటుందా ఉండదా అనే అనుమానం చాలా మందికి కలుగుతోంది.

బుల్లితెర టాక్ ప్రకారం బిగ్ బాస్ జూలైలోనో, ఆగస్టులోనో ప్రారంభం కావడం లేదట. ఇది సెప్టెంబర్ మూడో వారం నుంచి మొదలవుతుందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈసారి సీజన్ చాలా సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఐదో సీజన్కు సంబంధించిన లోగోను సెప్టెంబర్ మూడో వారం రిలీజ్ చేయబోతున్నారట. ఆ వెంటనే ఫస్ట్ ప్రోమోను కూడా విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి.

ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా సందడి చేయనున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది పేర్లు కంటెస్టెంట్లుగా తెరపైకి వచ్చాయి. వారిలో కొందరు ఒకే అయ్యారని మరికొందరితో చర్చలు జరుగుతున్నాయని బుల్లితెరలో టాక్ నడుస్తోంది.