సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు అవకాశాలు వస్తాయో ఎప్పుడు దూరం అవుతాయో చెప్పలేము.. చాలా మంది హీరోలు సూపర్ హిట్ సినిమాలు చేసి తర్వాత ఫ్లాపులు రావడంతో సినిమా అవకాశాలు రాక చిత్ర సీమ నుంచి దూరం అయ్యారు, అయితే మనం పాత హీరోలను వారు అందించిన హిట్ చిత్రాలను ఎప్పటికీ మర్చిపోలేము..హీరో హరీష్ కుమార్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన సూపర్ హిట్ సినిమాలు ఎన్నో చేశారు.
టాలీవుడ్ లో ప్రేమ ఖైదీ చిత్రం ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది, ఇది బాలవుడ్ లో రీమేక్ అయితే అక్కడ సక్సెస్ ఫుల్ హిట్ అయింది, ఇక తర్వాత రోజుల్లో సెకండ్ హీరోగా కూడా పలు సినిమాలు చేశారు, అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన డాడీ డాడీ–శోభన్ బాబు హీరోగా వచ్చిన ఏవండీ ఆవిడ వచ్చింది చిరంజీవి హీరోగా వచ్చిన ఎస్.పి.పరశురామ్, అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో.
గోకులంతో సీత సినిమాలో నటించారు, ఆయన దాదాపు టాలీవుడ్ కోలీవుడ్ లో మొత్తం 280 చిత్రాలు నటించారు, ఇక ఆయన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు, అయితే ఆయన కుమారుడ్ని కూడా ఇప్పుడు హీరో చెయ్యాలి అని చూస్తున్నారట,
హీరో హరీష్ 1975 ఆగస్టు 14 న జన్మించారు. ఆయన చైల్డ్ ఆర్టిస్టుగా చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చారు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలో దాదాపు 280 సినిమాలలో నటించాడు.1990 లో ఇ.వి.వి. దర్శకత్వంలో ప్రేమ ఖైదీ సినిమాతో కథానాయకుడిగా ఆయనక మంచి బ్రేక్ వచ్చింది.