మళ్లీ పెరిగిన బంగారం వెండి ధర కొత్త రేట్లు ఇవే

మళ్లీ పెరిగిన బంగారం వెండి ధర కొత్త రేట్లు ఇవే

0
31

బంగారం ధరకు మళ్లీ రెక్కలు వచ్చాయి… గడిచిన 11 రోజులుగా డైలీ తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పరుగులు పెట్టింది, ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర పెరిగింది… ఇక్కడ మాత్రం బంగారం ధర స్వల్పంగా పెరిగింది.. మళ్లీ రెండు రోజులుగా ఇండియాలో పసిడి ధర పెరుగుతోంది. మరి నేడు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

పుత్తడి ధర వరుసగా రెండో రోజు పెరిగింది….నిన్న మార్కెట్లో 50 రూపాయల పెరుగుదల కనిపించింది..నేడు పెరుగుదల 110 పెరిగింది ఈ రెండు రోజుల్లో దాదాపు 160 రూపాయల పెరుగుదల నమోదు చేసింది..22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,300 కు చేరింది.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,300కు చేరింది.

కిలో వెండి ధర నిన్న రూ.64,415 ఉండగా.. రూ. 1450 పెరిగి రూ.65,600కు పెరిగింది. ఇక వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గుతాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు, గడిచిన వారం రోజులుగా షేర్ల ర్యాలీ కొనసాగింది, అందుకే బంగారం తగ్గింది, ఇప్పుడు మళ్లీ షేర్ల తగ్గుదలతో బంగారం ధర పెరుగుతోంది. జనవరి వరకూ బంగారం ధరలు ఇలాగే ఉండనున్నాయి.