‘ఆకాశం నీ హద్దురా’ కాంబినేషన్ రిపీట్ కానుందా?

Will the 'sky is your limit' combination be repeated?

0
94

తెలుగు, తమిళ భాషల్లో సూర్యకి మంచి క్రేజ్ ఉంది. తమిళంలో ఎంతమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేసే సూర్య, తమిళంతో పాటు తెలుగులోను ఒకేసారి తన సినిమాలను విడుదల చేస్తుంటాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన తాజా చిత్రమైన ‘జై భీమ్’ సొంత బ్యానర్లో నిర్మితమైంది.

వచ్చే నెల 2వ తేదీ నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇంతకుముందు ఆయన చేసిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ ద్వారానే ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమాకి సుధా కొంగర దర్శకత్వం వహిస్తే, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అవబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత ఏడాది వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆకాశం నీ హద్దురా’ అంటూ వచ్చి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా ఇప్పుడు మరోసారి సుధ కొంగర సూర్యను డైరెక్ట్ చేయబోతోందట. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు ముగిశాయని సమాచారం. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న సూర్య సుధ కొంగరతో ప్రాజెక్ట్‌ను ఎప్పుడు ప్రకటించనున్నాడో చూడాలి.