యాత్ర2 వైఎస్ జగన్ బయోపిక్ లో హీరోగా నాగార్జున…

యాత్ర2 వైఎస్ జగన్ బయోపిక్ లో హీరోగా నాగార్జున...

0
132

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా యాత్ర మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే… మహివీ రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించారు… ఈ సినిమా బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే…

తాజాగా వైఎస్ కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యేంత వరకు జరిగిన సంఘటనను యాత్ర2 కు స్క్రిప్ట్ ను మహి సిద్దం చేసినట్లు వార్తలు వస్తున్నాయి… యాత్ర2లో జగన్ మోహన్ రెడ్డి పాత్రలో అక్కినేని నాగార్జున నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…

ఇటీవలే మహి కథను నాగార్జున కు చెప్పడంతో అతనిపై నమ్మకంతో నాగార్జున ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి… అయితే ఈ వార్త గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు ఒకవేళ వస్తే ఈ చిత్రాని భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం అని అంటున్నారు…