Yatra 2 | వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర. మహి. వి. రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ బయోపిక్‌లో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటించి మెప్పించారు. సుమారు నాలుగేళ్ల క్రితం విడుదలైన యాత్ర మూవీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్ ప్రజాప్రస్థానం, ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన పథకాలు చివరకు హెలికాప్టర్‌లో ప్రమాదవశాత్తూ చనిపోవడంతో యాత్ర సినిమా ముగుస్తుంది. కాగా, అప్పట్లోనే యాత్రకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు రాఘవ్. వైఎస్సార్ మరణం తర్వాతి పరిణామాలు, జగన్ పాదయాత్ర తదితర అంశాలతో యాత్ర-2(Yatra 2) తెరకెక్కించాడు. తాజాగా యాత్ర-2 రిలీజ్ డేట్ ప్రకటించారు. అంతేగాక, కొత్త పోస్టర్‌ని విడుదల చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యాత్ర సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని ప్రకటించాడు. ఈ సందర్భంగా రిలీజైన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
Read Also:
1. రేణుక చౌదరి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. ఏం చేసిందో తెలుసా?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat