Yatra 2 Trailer | నేను విన్నాను.. నేను ఉన్నాను.. యాత్ర2 ట్రైలర్ విడుదల..

-

Yatra 2 Trailer |ఏపీ సీఎం జగన్ జీవిత కథ ఆధారంగా ‘యాత్ర 2‘ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఓ పేద మహిళ తన కూతురి ఆపరేషన్ కోసం వైఎస్సార్ వద్దకు వస్తే ఆరోగ్యశ్రీ పథకం ఆలోచనతో ట్రైలర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత వైఎస్సార్ మరణం, జగన్ జైలు జీవితం, ఆ తర్వాత జరిగిన రాజకీయాలు, జగన్ జనాల్లోకి వెళ్లడం.. లాంటి అంశాలతో ట్రైలర్ సాగింది. చివర్లో వైఎస్సార్ లాగే జగన్ కూడా నేను విన్నాను.. నేను ఉన్నాను అనే డైలాగ్‌తో ముగించారు.

- Advertisement -

తమిళ హీరో జీవా(Jiiva) జగన్ పాత్రలో నటించగా.. చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్‌ కనిపించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

Yatra 2 Trailer | కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘యాత్ర 2’ సినిమాను రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 8న మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Read Also: నేను చనిపోలేదు.. బతికే ఉన్నాను: పూనమ్ పాండే
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...