గెట్ రెడీ..బాలయ్య ‘అన్​స్టాపబుల్’​ సీజన్-2​ వచ్చేస్తుంది!

0
352

అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవరు ఆపుతారో చూద్దాం” అంటూ నందమూరి బాలకృష్ణ తొలిసారిగా వ్యాఖ్యాతగా చేసిన టాక్‌ షో ‘అన్‌ స్టాపబుల్‌ విత్​ ఎన్​బీకే’. ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రసారమైన ఈ కార్యక్రమం ‘మోస్ట్‌ వాచ్డ్‌ షో’గా అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందింది. టాక్​ షోలలో నెం.1గా నిలిచింది. విజయవంతంగా సీజన్ 1 ముగియగా ఇప్పుడు సీజన్ 2 రానుంది.

“మీ ఫెవరెట్​, ఇండియాస్​ నెం.1టాక్​ షో రెండో సీజన్ త్వరలోనే ప్రారంభంకానుంది. గెస్టులుగా ఎవరిని ఆహ్వానిద్దాం?” అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది. ఆగస్టు 15న షోకు సంబంధించిన వివరాలను తెలియజేస్తామని చెప్పింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్​ తెగ సంబరపడిపోతున్నారు.

మరోవైపు బాలయ్య వరుస సినిమాలతో జోష్ మీదున్నాడు. ఇటీవల విడుదలైన అఖండ ఎంత విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ జోష్ లో అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని వంటి డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నాడు.

https://twitter.com/ahavideoIN?