ప్రణాళికతోనే సికింద్రాబాద్ అల్లర్లు..A1 గా కామారెడ్డి వాసి

0
52
FSL Report agnipath

పలు వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకున్న యువకులు, 17వ తేదీ విధ్వంసానికి కుట్ర పన్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు పెట్రోల్ బాటిళ్లు, కర్రలతో చేరుకున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో గేట్ నెంబర్ 3 నుంచి ప్లాట్‌ఫాం-1కి చేరుకొని ఆందోళనకు దిగారు. రైళ్ల అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు, ప్లాట్‌ఫాంపై ఉన్న స్టాళ్లను ధ్వంసం చేశారు.

ఆ తర్వాత మూడు రైళ్లలోని నాలుగు బోగీలకు నిప్పు పెట్టారు. వాట్సప్‌ గ్రూపుల్లో రెచ్చగొట్టి విధ్వంసానికి కుట్ర పన్నినట్లు తేలింది. ఈ అల్లర్లకు సంబంధించి 56 మందిని నిందితులుగా చేర్చి, వారిలో 46 మందిని ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. ఈ కేసులో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన మధుసూదన్‌ను ఏ1గా తేల్చాం. డిఫెన్స్ అకాడమీలకు చెందిన కొంతమంది నిర్వాహకులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు నిర్ధారణకు వచ్చాం.

ఈ విధ్వంసం వల్ల రూ.20 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ నర్సయ్య 18 మంది సాక్షులను విచారించారు’’ అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.