పంజాబ్(Punjab)లోని లుథియానాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ లీకై ఇద్దరు చిన్నారులు సహా 11 మంది మృతి చెందారు. గియాస్‌పురా ప్రాంతం గోయల్ మిల్క్ ప్లాంట్‌లో ఆదివారం(ఏప్రిల్ 30) ఉదయం 7.15 గంటల సమయంలో గ్యాస్ లీకేజీని గుర్తించారు. శీతల పానీయాల దుకాణం, కిరాణా దుకాణం, మెడికల్ క్లినిక్ సహా వివిధ సంస్థలతో కూడిన బ్లాక్ నుంచి గ్యాస్ లీకైంది. దీంతో 300 మీటర్ల పరిధిలోని కార్మికులు, ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతసేపటికి అసలు ఊపిరాడకపోవడంతో తొలుత 9 మంది మృతి చెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఇంకా ఆరుగురు వరకు అస్వస్థతకు గురయ్యారు. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలియడంతో ఎన్డీఆర్ బృందం సహాయ చర్యలు అందించింది. ప్రత్యేక వైద్య బృందాలు పరిస్థితులను పరిశీలించారు.Punjab
Read Also: దేశవ్యాప్తంగా భారీ వర్ష సూచన చేసిన IMD
Follow us on: Google News, Koo, Twitter