మళ్లీ చెలామణిలోకి రూ.1000 నోటు?

-

1000 Rupee Note |అనూహ్యంగా రెండు వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల వేళ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వెనుక కేంద్రం కుట్ర ఉన్నదని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూ.2 వేల నోటు రద్దుతో కరెన్సీ నోట్లలో అతిపెద్ద నోటుగా రూ. 500 నోట్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో ఆర్బీఐ రూ. 500 నోటునే పెద్ద నోటుగా కొనసాగిస్తుందా..లేక ఇంతకంటే విలువైన పెద్దనోటును ముద్రిస్తుందా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక, ఆర్బీఐ మరోసారి రూ. 1000 నోట్(1000 Rupee Note) తీసుకురానుందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో పాత నోట్లను రద్దు చేసిన తర్వాత కూడా మరోసారి వెయ్యి రూపాయల నోటును ఆర్బీఐ తీసుకువస్తుందన్న ప్రచారం జరిగింది. రూ.2 వేల నోట్ను రద్దు చేస్తుందని.. రూ.1000 నోట్ను మళ్లీ తెస్తుందని జోరుగా వదంతులు వ్యాపించాయి. అయితే ఇప్పుడు రూ. 2 వేల నోట్ను ప్రభుత్వం రద్దు చేయడంతో  మరోసారి రూ. 1000 నోట్ ముద్రిస్తారన్న వార్తలకు బలం చేకూరింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...