జమ్మూకశ్మీర్‌లో పెను విషాదం.. 36 మంది మృతి

-

జమ్మూ కశ్మీర్‌(Jammu Kashmir)లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా.. మరో 19 మంది గాయపడ్డారు. దోడా జిల్లాలోని బటోటే-కిష్టావర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

- Advertisement -

బుధవారం ఉదయం 55 మందికి పైగా ప్రయాణికులతో కిష్త్వాఢ్‌ నుంచి బస్సు బయలుదేరింది. తృంగాల్‌-అస్సార్‌ ప్రాంతానికి చేరుకోగానే 300 అడుగుల లోయలో బస్సు జారిపడింది. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జయ్యింది. సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కిష్టావర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు హెలికాప్టర్‌ సేవలను సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు.

Jammu Kashmir | ఈ బస్సు దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.

Read Also: కుక్క కరిస్తే రూ.10వేలు పరహారం.. ఎక్కడో తెలుసా..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Reduce Bad Cholesterol | కొవ్వు కోవాలా కరగాలా.. ఇవి తినేయండి..

మన శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత...

Rahul Gandhi | కుల గణన అంటే మోదీకి ఎందుకంత భయం: రాహుల్ గాంధీ

దేశంలోని అన్ని వ్యవస్థల్లో, అన్ని రంగాల్లో కుల వ్యవస్థ ఉందనేది అక్షర...