‘ప్రాణాలు కావాలంటే డబ్బివ్వు’.. సల్మాన్ ఖాన్‌కు మళ్ళీ బెదిరింపులు..

-

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌(Salman Khan)కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇప్పటికే సల్మాన్ హత్యకు కుట్ర జరిగిందన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించే తాజాగా పోలీసులు హర్యానాలో ఓ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇంతలో మరోసారి సల్మాన్ ప్రాణాలకు ముప్పు ఉందని, అతడు ప్రాణాలతో ఉండాలంటే తాము డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వాలంటూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఓ మెసేజ్ వచ్చింది. అందులో తమకు రూ.5కోట్లు ఇస్తే సల్మాన్‌ను ప్రాణాలతో వదిలి పెడతామంటూ దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. ‘‘మా బెదిరింపులకు తేలికగా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా మాకు సల్మాన్ రూ.5కోట్లు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వకుండా ఇటీవల హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే సిద్దిఖీ కన్నా దారుణమైన పరిస్థితులను సల్మాన్ ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని బెదిరింపు మేసేజ్‌లో పేర్కొన్నారు దుండగులు.

- Advertisement -

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు పంపారు? ఎందుకు పంపారు? ఎక్కడి నుంచి పంపారు? అన్న అంశాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే బాంద్రాలోని సల్మాన్ ఇంటి దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే సల్మాన్‌(Salman Khan)కు ఇటువంటి బెదిరింపులు రావడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు సల్మాన్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. గతేడాది ఏప్రిల్‌లో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర నాలుగు రౌండ్ల కాల్పులు కూడా జరపడం జరిగింది. ఆ కేసుకు సంబంధించే రెండు రోజుల క్రితం మరో నిందితుడిని పోలీసులు హర్యానాలో అదుపులోకి తీసుకున్నారు.

Read Also: హవాలా కేసులో తమన్నా.. విచారించిన ఈడీ..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...