యూపీలో వరుస ఎన్ కౌంటర్లపై సుప్రీంకోర్టులో పిటిషన్

-

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో బూటకపు ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయని న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 2017లో యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) సీఎం అయిన దగ్గరి నుంచి ఇప్పటివరకు మొత్తం 183 ఎన్ కౌంటర్లు జరిగాయని.. వీటిపై దర్యాప్తునకు ఓ కమిటీని నియమించాలని పిటిషన్ లో కోరారు. యూపీలో యోగి నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఆ రాష్ట్రంలో రౌడీలు, గ్యాంగ్ స్టర్ల ఏరివేత మొదలైంది. ఇప్పటికే ఎంతోమంది రౌడీలు, గుండాలు పోలీసులు ఎన్ కౌంటర్లలో చనిపోయారు.

- Advertisement -
తాజాగా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడిని మీడియా..పోలీసుల సమక్షంలోనే దుండగులు కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో రౌడీల ఏరివేత పేరుతో ప్రభుత్వం బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తివారి ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి, న్యాయవ్యవస్థకు పెను ముప్పు అని పేర్కొన్నారు.
Read Also: ఏపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ పవన్ వార్నింగ్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...