కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah) బిహార్ పాలకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బిహార్ లో పర్యటించిన అమిత్ షా.. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్(Laluprasad Yadav), ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్(Nitish kumar)లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు జరిగాయని తెలిపారు. అశోకచక్రవర్తి జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు బిహార్ వచ్చిన అమిత్ షా(Amit Shah).. సాసారాంలో జరుగుతున్న అల్లర్ల(Communal Violence)పై మండిపడ్డారు. అల్లర్ల వల్ల ప్రజలు చనిపోతున్నారని.. బిహార్ లో తాము అధికారంలో వచ్చిన వెంటనే అల్లర్లకు పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడిస్తామని హెచ్చరించారు. నితీశ్ ప్రభుత్వం అవినీతి, అరాచకాలకు అడ్రస్ గా మారిందని విమర్శించారు. తన కొడుకు తేజస్వి యాదవ్ ను బిహార్ సీఎం చేయాలని, నితీశ్ ఏమో దేశ ప్రధాని కావాలని కలలు కంటున్నారని.. వారి కలలు కలలుగానే మిగిలిపోతాయని ఎద్దేవా చేశారు. దేశ ప్రధానిగా మరోసారి మోదీ(Modi)నే ఉండబోతున్నారని జోస్యం చెప్పారు షా.
Read Also: పరగడుపునే మెంతి నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలివే
Follow us on: Google News, Koo, Twitter