కేంద్రంలో మూడోసారి విజయం సాధించడంపై హోంమంత్రి అమిత్ షా(Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ తప్పక హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లు గెలుచుకుని మూడోసారి అధికారాన్ని దక్కించుకుంటుందన్నారు. అస్సాంలోనూ 14 లోక్‌సభ స్థానాలకు గానూ 12 స్థానాల్లో గెలుస్తామన్నారు. మంగళవారం అస్సాం(Assam)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఈశాన్య రాష్ట్రాలు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేవని.. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసిందన్నారు.
మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో బీజేపీయే అధికారంలో ఉందని గుర్తు చేశారు. మరో రెండు రాష్ట్రాల్లో మిత్ర పక్షాలతో ప్రభుత్వాలను ఏర్పాటు చేశామన్నారు. 1958 నాటి ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్‌ను తొలగించిన తర్వాత అస్సాంలో శాంతి సామరస్యాలు నెలకొన్నాయన్నారు. గతంలో ఆందోళనలు, తీవ్రవాదానికి మారుపేరుగా ఉంటే.. ఇప్పుడు బిహూ సంగీతంపై నృత్యాలు చేస్తున్నారని షా(Amit Shah) చెప్పుకొచ్చారు.
Read Also: ఏమాత్రం రాజకీయ అవగాహన లేని అజ్ఞాని బండి సంజయ్: KTR
Follow us on: Google News, Koo, Twitter