జమ్మూకాశ్మీర్ లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్

-

జమ్మూకాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్(Army Helicopter Crash) కుప్పకూలింది. ఏఎల్ హెచ్ (ALH) ధ్రువ హెలికాప్టర్ లో ఉదయం 11: 15 గంటలకు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్(ATC) కు ఇన్ఫర్మ్ చేసి మారవా నది ఒడ్డున అత్యవసర లాండింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ ఒక్కసారిగా నేలను బలంగా తాకడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు పైలట్ లు, ఒక టెక్నీషియన్ హెలికాప్టర్ లో ఉన్నారు. గాయపడిన ఆ ముగ్గురిని ఉధంపూర్ కమాండ్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే తరహాలో మార్చిలో అరుణాచల్ ప్రదేశ్‌లోని మండల హిల్స్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ చీతా హెలికాప్టర్ కూలిపోవడంతో(Army Helicopter Crash) ఇద్దరు పైలట్లు మరణించారు. ఈ ప్రమాదం కూడా టెక్నికల్ లోపం కారణంగానే జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు.

- Advertisement -
Read Also: పొంగులేటితో ఈటల భేటీ పై బండి సంజయ్ రియాక్షన్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...