సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి భారీ ఊరట

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మోదీ ఇంటిపేరు పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. కింద కోర్టు విధించిన తీర్పులో ఎలాంటి ఆధారాలు లేవని చెబుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం తాజా తీర్పుతో రాహుల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది. సుప్రీం తీర్పుపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. న్యాయం గెలిచింది.. బీజేపీ ప్రభుత్వ కుట్రలు చిత్తయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. బీజేపీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారని.. ప్రజలు రాహుల్ గాంధీకి అండగా నిలిచారన్నారు.

- Advertisement -

2019లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందనని చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌కు చెందిన పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రాహుల్‌ను దోషిగా గుర్తిస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. సూరత్ కోర్టు తీర్పుపై హైకోర్టును రాహుల్ గాంధీ ఆశ్రయించినా అక్కడ కూడా ఊరట దక్కలేదు. దీంతో రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో ఆయన తన అధికారిక నివాసం నుంచి కూడా ఖాళీ చేసిన సంగతి తెలిసిందే. అయినా కానీ న్యాయపోరాటం మాత్రం ఆపలేదు.

చివరగా సూరత్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాహుల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణకు వచ్చింది. సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎవరి పేరును ప్రస్తావించలేదని సింఘ్వీ వాదించారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు 13 కేసులను ఉదహరించిందన్నారు. వాస్తవానికి బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అసలు ఇంటిపేరు మోదీ కాదని.. ఆయన ఆ ఇంటి పేరును తర్వాత పెట్టుకున్నారని తెలిపారు.

బీజేపీ కార్యకర్తలు దాఖలు చేసిన కేసుల్లో నేరపూరిత పూర్వాపరాలు, శిక్షలు లేవన్నారు. మరోవైపు పిటిషనర్ పూర్ణేశ్ మోదీ తరఫున ప్రముఖ సీనియర్ లాయర్ మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. రాహుల్ గాంధీ ప్రసంగం 50 నిమిషాల పాటు సాగిందన్నారు. అందులో రాహుల్ గాంధీ ఒక సామాజిక వర్గం మొత్తాన్ని అవమానించారని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...