దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల ఐక్యతను ముమ్మరం చేస్తామని బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar ) తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష పార్టీలతో ఓ భారీ సమావేశం నిర్వహించి రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తామని నితీశ్ చెప్పారు. నితీశ్ కుమార్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఈ నెల 24వ తేదీన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee)ని కలిసినప్పుడు పాట్నాలో బీజేపీయేతర పార్టీల సమావేశం నిర్వహించాలని ఆమె కోరారు. ఇతర పార్టీలన్నీ పాట్ననే కోరితే అక్కడే సమావేశమవుతామని నితీశ్ తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేయడమే తన లక్ష్యమన్నారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తోనూ నితీశ్(Nitish Kumar ), తేజస్వి సమావేశమై ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పాటుపై చర్చించారు.
Read Also: నన్నే కాదు కాంగ్రెస్ అంబేద్కర్‌ను కూడా విమర్శించింది: ప్రధాని
Follow us on: Google News, Koo, Twitter