Patna Meeting | సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ బిహార్ రాజధాని పాట్నాలో సమావేశం కావడంపై కమలం నేతలు తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. విపక్షాల సమావేశాన్ని ఫొటో సెషన్‌గా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అభివర్ణించారు. ప్రధాని మోదీని అధికారంలో నుంచి దించాలని భావిస్తున్న ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండలేవని ఎద్దేవా చేశారు.
Patna Meeting | 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 300 కు పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధించి మరోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలతో కలిసి సమావేశమైన కాంగ్రెస్ పార్టీ.. బీజేపీని ఒంటరిగా ఓడించలేమని బహిరంగంగా ఒప్పుకుందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సెటైర్లు వేశారు. తమ సొంత ప్రయోజనాల కోసమే పాట్నాలో సమావేశం ఏర్పాటు చేశాయని బీజేపీ ఎంపీ రవి కిషోర్ విమర్శించారు.
Read Also:
1. నా మీద జరిగిన దాడి ప్రపంచంలో ఏ నేత మీదా జరిగి ఉండదు: సీఎం కేసీఆర్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat