లిక్కర్ స్కాం కేసులోలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు మరో షాక్ తగిలింది. ఈ కేసులో కవితను విచారించాలని సీబీఐ అధికారులు ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. తిహార్ జైలులో ఆమెను ప్రశ్నించేందుకు ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రశ్నించే సమయంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయాలని సూచించింది.
కాగా గతంలో విచారించినప్పుడు కవిత ఇచ్చిన స్టేట్‌మెంట్, నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు సీబీఐ(CBI) సిద్ధమవుతోంది. కవిత నుంచి వీలైనంత సమాచారం రాబట్టి మరో ఛార్జీషీటు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. లిక్కర్ కేసులో రూ.100కోట్లు ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసింది. మరోవైపు కవిత(MLC Kavitha) మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.