మరో అడుగు దూరంలో.. చంద్రుడిపై అద్భుతమైన ఫొటోలు పంపిన ల్యాండర్

-

చంద్రయాన్‌-3(Chandrayaan 3) చందమామకు మరింత చేరువలోకి వచ్చింది. చంద్రుడి దక్షిణ ధృవం దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. తాజాగా ల్యాండర్‌ కెమెరా తీసిన తాజా చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. ఇవి చంద్రుడి అటువైపు భాగానికి సంబంధించినవి. ఈ ఫొటోలను ల్యాండర్‌ హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవాయిడెన్స్‌ కెమెరా తీసింది. సేఫ్‌ ల్యాండింగ్‌ను ఈ కెమెరా నిర్ణయిస్తుంది. వీటిని చంద్రయాన్-3 మిషన్‌లోని ల్యాండర్ హాజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడాన్స్ కెమెరా క్యాప్చర్ చేసిందని ఇస్రో(ISRO) శాస్త్రవేత్తలు ట్వీట్‌లో తెలిపారు.

- Advertisement -

మొత్తం మిషన్‌లో ఈ కెమెరా అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఇదే.. ల్యాండర్ దిగే ప్రదేశాన్ని చూపిస్తుంది. సరైన ప్రదేశంలో ల్యాండర్ దిగేలాగా సాయం చేస్తుంది. ల్యాండర్ దిగే చోట ఎత్తు పల్లాలు ఉండకూడదు. రాళ్లు ఉంటే ప్రమాదం. అలాంటివి లేని చోట ల్యాండర్ దిగేలా చేసేందుకు ఈ కెమెరా చక్కగా ఉపయోగపడనుంది. ల్యాండర్‌ పంపిన తాజా ఫొటోలను బట్టి చంద్రుడి ఉపరితలం రాతి నేలగా ఉంది. ఈ ఫొటోల్లో కనిపిస్తున్నట్లు.. చదరంగా ఉన్న నేలపైనే ల్యాండర్ విక్రమ్ దిననున్నట్లు తెలిపింది ఇస్రో. చంద్రుడి ఉపరితలం కొన్ని ప్రాంతాల్లో చదరంగా ఉండగా..మరికొన్ని ప్రాంతాల్లో లోయలు ఉన్నాయి. అంటే భూమిని పోలిన విధంగా చంద్రుడి ఉపరితలం ఉన్నట్లు ఫొటోలతో స్పష్టం అవుతుంది. చంద్రయాన్ 3 కొత్తగా పంపించిన ఫొటోలతో ల్యాండింగ్ ప్లేస్ కూడా డిసైడ్ చేసుకుంది ఇస్రో.

ఇప్పటివరకూ చంద్రయాన్ 3(Chandrayaan 3) మిషన్ అంతా సవ్యంగానే జరిగింది. ఇప్పుడు ఈ కెమెరా కూడా బాగా పనిచేస్తోందని అర్థమైంది. చంద్రయాన్ 3 గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోట్ల మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 23న సాయంత్రం 6.04గంటలకు చందమామ దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ దిగితే ప్రపంచ పరిశోధనా రంగంలో భారత్ అద్భుతం సృష్టించిందనే చెప్పాలి. చంద్రుడి దక్షిణ ధృవంలో ఇప్పటి వరకు ఏ దేశం పరిశోధనలు చేయలేదు. ఇండియా, రష్యాలు మాత్రమే ఒకేసారి రెండు శాటిలైట్లను పంపాయి. రష్యా ప్రయోగించిన లూనా 25 శాటిలైట్ ఫెయిల్ కావటంతో.. ప్రపంచం దృష్టి భారత్‌పై పడింది.

Read Also: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన ప్రకటన
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...