భారతదేశ అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్‌గా డీవై చంద్రచూడ్(CJI Chandrachud) పదవీ కాలం ముగింపుకు వస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐగా సీనియర్ న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు నియమితులు కావడానికి అధిక అవకాశాలు కనిపిస్తున్నాయి. డీవై చంద్రచూడ్ కూడా సంజీవ్ పేరునే సిఫార్సు చేశారు. చంద్రచూడ్ చేసిన ప్రతిపాదనను కేంద్రం ఓకే చేస్తే భారతదేశ సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా నియమితులు అవుతారు.
నిబంధనల ప్రకారం.. ప్రస్తుత సీజేఐ లేఖ రూపంలో కేంద్ర న్యాయశాఖకు తన సిఫార్సును అందిస్తారు. ప్రధాని పరిశీలించి కేంద్రం ఓకే చెప్పిన తర్వాత అదే లేఖ రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్తుంది. అంతిమంగా రాష్ట్రపతి ఆమోదం తెలిపితే ప్రధాన న్యాయమూర్తిగా సదరు సిఫార్సు చేయబడిన న్యాయమూర్తి బాధ్యతలు తీసుకుంటారు.
సీజేఐ తన తర్వాత ఆ పదవికి సుప్రీకోర్టులోని సీనియర్ న్యాయమూర్తిని సిఫార్సు చేయడం సంప్రదాయంగా వస్తుంది. ఆ లెక్కన తీసుకున్నా చంద్రచూడ్(CJI Chandrachud) తర్వాత ఆ పదవిని సంజీవ్ ఖన్నా చేపట్టాల్సి ఉంటుంది. చంద్రచూడ్ పదవీ కాలం ఈ ఏడాది నవంబర్ 11తో ముగియనుంది. ఆ తర్వాత రోజే అంటే నవంబర్ 12న కొత్త సీజేఐ బాధ్యతు చేపడతారు. వాళ్లు వచ్చే ఏడాది మే 13న పదవీ విరమణ చేస్తారు.