భారత దేశంలో రాఖీ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనురాగానికి రాఖీ పండుగ ప్రతీక. ప్రపంచ వ్యాప్తంగా సోదరులు ఎక్కడ ఉన్నా రాఖీ రోజున వారి దగ్గరకి వెళ్లి రాఖీ కడుతుంటారు లేదా రాఖీ కొరియర్ లో అయినా పంపిస్తారు. ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్( Yogi Adityanath) మహిళలకు భారీ రక్షా బంధన్ కానుక ప్రకటించారు. కన్యా సుమంగళ యోజన పథకం మొత్తం రూ. 25,000కి పెంచుతూ సీఎం యోగి నిర్ణయం తీసుకున్నారు.
2024-25 నుంచి ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన(Kanya Sumangala Yojana) మొత్తాన్ని రూ. 10,000 పెంచుతున్నట్లు పేర్కొన్నారు. లోక్ భవన్ లో ముఖ్యమంత్రి( Yogi Adityanath) కన్యా సుమంగళ పథకం లబ్ధిదారులను ఉద్ధేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం కన్యా సుమంగళ పథకం మొత్తాన్నిరూ.15,000 నుండి రూ.25,000కి పెంచబోతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి, పౌష్టికాహార శాఖ మంత్రి బేబీ రాణి మౌర్య, రాష్ట్ర ఇన్ ఛార్జ్ మంత్రి ప్రతిభా శుక్లా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.